PM Modi : త్రివర్ణ పతాకం ఐక్యతకు చిహ్నం – మోదీ
సూరత్ ను కొనియాడిన ప్రధానమంత్రి
PM Modi : త్రివర్ణ పతాకం భారత దేశ ఐక్యతకు, సమగ్రత్తకు, భిన్నత్వానికి చిహ్నమని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). జాతీయ పతాకంలో మూడు రంగులు మాత్రమే ఉండవన్నారు.
ఇది మన గతానికి సంబంధించిన దానిని తెలియ చేస్తుందన్నారు. వర్తమానం పట్ల మన నిబద్దత, భవిష్యత్తు గురించి మన కలల ప్రతిబింబమని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
గుజరాత్ లోని సూరత్ లో తిరంగా ర్యాలీ చేపట్టారు. సందర్భంగా గురువారం ర్యాలీని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు నరేంద్ర మోదీ. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు.
భారత దేశం నలుమూలలా త్రివర్ణ పతాకాన్ని రెపరెప లాడుతున్నందున మనందరం ఈ చారిత్రిక దినోత్సవానికి సిద్దం కావడం ఆనందంగా ఉందన్నారు నరేంద్ర మోదీ.
గుజరాత్ లోని ప్రతి మూల కూడా ఉత్సాహంతో నిండి పోయిందన్నారు. సూరత్ దాని కీర్తిని మరింత పెంచేలా చేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు ప్రధాన మంత్రి. యావత్ భారత్ మొత్తం ఈ నగరంపై ఫోకస్ ఉందన్నారు.
సూరత్ తిరంగ యాత్రలో ఓ విధంగా మినీ భారతం కనిపిస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు ప్రధాన మంత్రి.
త్రివర్ణ పతాకం నిజమైన ఏకీకరణ శక్తిని సూరత్ చూపించిందన్నారు. సూరత్ తన వ్యాపారం , పరిశ్రమల కారణంగా ప్రపంచంపై ఒక ముద్ర వేసిందన్నారు.
మన జాతీయ పతాకం దేశ వస్త్ర పరిశ్రమకు, ఖాదీకి , మన స్వావలంభనకు ప్రతీక అని మోదీ(PM Modi) స్పష్టం చేశారు.
Also Read : మీ సహకారం మరిచి పోలేనన్న సీఎం