Owaisi MP : ఇందిర‌ను చూసి గుణ‌పాఠం నేర్చుకోవాలి

రాజ్యాంగ నిర్మాణంపై విమ‌ర్శ‌లు త‌గ‌దు

Owaisi MP : ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఆనాటి ఇందిరా గాంధీ శ‌కాన్ని తిరిగి తీసుకు వ‌స్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మైనార్టీలు ఇవాళ దేశంలో రెండో శ్రేణి పౌరులుగా భ‌యంతో బ‌తుకుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా భార‌త్ , చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద నెల‌కొన్న ప‌రిస్థితిపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi MP).

నాటి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీని చూసి నేటి ప్ర‌భుత్వం గుణ‌పాఠం నేర్చుకోవాలని సూచించారు ఎంపీ. న్యాయ‌మూర్తుల నియామ‌క ప్ర‌క్రియ కొంత గంద‌ర‌గోళానికి దారి తీయ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌లో పాల్గొన్నారు ఓవైసీ. మైనార్టీల సంక్షేమం కోసం ప‌ని చేయ‌డం లేద‌ని ఆరోపించారు.

రాజ్యాంగ ప‌ద‌వుల‌పై వ్య‌క్తులు ప్రాథ‌మిక నిర్మాణంపై వ్యాఖ్యానిస్తున్నారు. కొలీజియంపై న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు త‌న ప‌రిధిని దాటి కామెంట్స్ చేశారు. తాను ఏనాడో ఇదే విష‌యం గురించి అభ్యంత‌రం తెలిపాన‌ని అన్నారు ఎంపీ. నేష‌న‌ల్ జ్యుడీషియ‌ల్ అపాయింట్మెంట్స్ క‌మిష‌న్ బిల్లు వ‌చ్చిన‌ప్పుడు అది ప్రాథ‌మిక నిర్మాణానికి వ్య‌తిరేకంగా ఉంటుంద‌ని చెప్పిన ఏకైక వ్య‌క్తిని, ఎంపీని తాను ఒక్క‌డినేన‌ని స్ప‌ష్టం చేశారు అస‌దుద్దీన్ ఓవైసీ.

ఇక‌నైనా మోదీ మారాల‌ని అన్నారు. ఆనాడు న్యాయ వ్య‌వ‌స్థ త‌న‌ను అనుస‌రించాల‌ని ఇందిరా గాంధీ అన్నార‌ని, ఇప్పుడు పీఎం మోదీ న్యాయ వ్య‌వ‌స్థ త‌న‌కు విధేయంగా ఉండాల‌ని చెబుతున్నార‌ని .. ఇది చెల్లుబాటు కాద‌న్నారు ఎంపీ(Owaisi MP).

Also Read : తేజ‌స్ జెట్ ఆత్మ నిర్భ‌ర్ కు ద‌ర్ప‌ణం

Leave A Reply

Your Email Id will not be published!