Modi : కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యానికి ప్రమాదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు
Modi : భారత దేశ ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. గురువారం హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో మోదీ ప్రసంగించారు.
మోదీ ప్రధానంగా టీఆరెఎస్ సర్కార్ పై గురి పెట్టారు. ఆపై సీఎం కేసీఆర్ , ఆయన కుటుంబం చేస్తున్న పాలన గురించి ప్రస్తావించారు. ఎందరో బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క కుటుంబానికే పరిమితం కావడం బాధాకరమన్నారు.
పట్టుదలకు , పౌరుషానికి మారు పేరు తెలంగాణ వాసులు. మీ అందరి ఆదరాభిమానాలే తనకు బలమని చెప్పారు మోదీ. తాను ఎప్పుడు వచ్చినా మీరంతా ఎంతగానో ఆదరిస్తున్నారంటూ ప్రశంసించారు.
ఓ వైపు తట్టుకోలేని ఎండలు ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం మీకు నా పట్ల ఉన్న అభిమానం ఏమిటో తెలియ చేస్తుందన్నారు మోదీ(Modi).
తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగు జాడల్లో నడుస్తున్నా. ఆయన కన్న కలల్ని సాకారం చేద్దామంటూ పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి.
దేశాన్ని ముక్కలు చేయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారు. కానీ వారి ఆటలు సాగవంటూ హెచ్చరించారు మోదీ(Modi). కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకుని అన్నారు.
టీఆర్ఎస్ పాలన అంతా అవినీతి మయం అయ్యిందంటూ ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మోదీ.
Also Read : ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ ఫైర్