Modi : టెలికాం రంగంలో ఇండియా దూకుడు

కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ ఆగ్ర‌హం

Modi : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేపాల్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించిన ఆ పార్టీ అన్ని రంగాల‌ను నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు.

ద‌శాబ్ద కాలంగా విధాన‌ప‌ర‌మైన ప‌క్ష‌వాతం, అవినీతిని కోల్పోయిన త‌ర్వాత అన్ని రంగాల‌లో వృద్ధిని పెంచేందుకు 5జీ, 6జీ లు దోహ‌ద ప‌డ‌తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు మోదీ(Modi).

భార‌త దేశం ఇప్పుడు 2జీ, 3జీ, 4జీని దాటుకుని ముందుకు వెళుతోంద‌న్నారు. బ‌హుళ ఇనిస్టిట్యూట్ స‌హ‌కార ప్రాజెక్టుగా అభివృద్ది చేసిన 5జీ టెస్ట్ బెడ్ ను ప్ర‌ధాన మంత్రి మోదీ మంగ‌ళ‌వారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌త్యేకించి టెలికాం రంగంలో ఊహించ‌ని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని చెప్పారు. ఈ రంగంలో దేశం వేగంగా పురోగ‌మిస్తోంద‌ని తెలిపారు.

కాంగ్రెస్ దీనిని చూసి త‌ట్టుకోలేక పోతోంద‌న్నారు. 2జీ స్కాం అంటేనే కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వ‌స్తుంద‌న్నారు. ఆ పార్టీ హ‌యాంలో అన్నీ స్కాంలే త‌ప్పా ప్ర‌గ‌తి ఎక్క‌డ క‌నిపించింద‌ని మోదీ(Modi) ప్ర‌శ్నించారు.

టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. నిరాశ‌, అవినీతి, 2జీ విధాన ప‌క్ష‌వాతం నుండి బ‌య‌ట ప‌డింద‌న్నారు.

స్వావ‌లంబ‌న‌, ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ స‌మాజం , ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో అనే దానికి టెలికాం రంగం ఓ గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు మోదీ.

ఇదిలా ఉండ‌గా ఐఐటీ మ‌ద్రాస్ నేతృత్వంలో మొత్తం 8 ఇనిస్టిట్యూట్ లు బ‌హుళ ఇనిస్టిట్యూట్ స‌హ‌కార ప్రాజెక్టుగా అభివృద్ది చేసింది.

Also Read : పాక్ తీర్మానం భార‌త్ ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!