Modi : ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
అధికారికంగా ధ్రువీకరించింది. అంతకు ముందు దేశంలో ఉన్న ఉక్రెయిన్ రాయబారి ప్రధాని జోక్యం చేసుకోవాలని, పుతిన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడైనందు వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కించేలా చూడాలని కోరారు.
అంతే కాకుండా భారత దేశానికి చెందిన 20 వేల మందికి పైగా విద్యార్థులు ఉక్రెయిన్ లోనే ఉండి పోయారు. యుద్దం కొనసాగుతుండడంతో ఆ దేశం 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించింది.
ఇదే సమయంలో గగన తలం కూడా మూసి వేయడంతో భారత్ కు చెందిన విమానాలు తిరిగి వచ్చాయి. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.
ఈ తరుణంలో ప్రధాని మోదీ మానవతా దృక్ఫథంతో ఓ అడుగు ముందుకు వేశారు. పుతిన్ తో మాట్లాడారు. దయచేసి యుద్దాన్ని నిలిపి వేయాలని, సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు.
ఇందుకు నాటో అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు మోదీ(Modi ). యుద్దాన్ని భారత్ ఎప్పుడూ కోరుకోదని అన్ని దేశాలు బాగుండాలని కోరుకుంటాయని ఈ సందర్భంగా పుతిన్ కు మరోసారి స్పష్టం చేశారు.
అంతే కాకుండా ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన భారతీయులతో పాటు విద్యార్థుల పరిస్థితి గురించి కూడా వివరించారు ప్రధానమంత్రి.
Also Read : పని తీరుకు పట్టం విజయం తథ్యం