PM Narendra Modi : స‌హ‌కార రంగం మ‌రింత బ‌లోపేతం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Narendra Modi : దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో స‌హ‌కార రంగం పాత్ర మ‌రిచి పోలేనిదంటూ పేర్కొన్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. గుజ‌రాత్ రాష్ట్రంలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ సంద‌ర్భంగా మోదీ త్ర‌యం ఆ రాష్ట్రంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఇక్క‌డ పాటిదార్ క‌మ్యూనిటీ ఎక్కువ‌గా ఉంది. రాష్ట్రంలో అత్య‌ధిక స్థానాల‌ను ప్ర‌భావితం చేసే స‌త్తా పాటిదార్ల‌కే ఉంది.

ఇప్ప‌టికే పాటిదార్ నాయ‌కుడిగా పేరొందిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న‌ను ఎలాగైనా బీజేపీలోకి చేర్చు కోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా క్వాడ్ సమ్మిట్ లో పాల్గొన్న అనంత‌రం గుజ‌రాత్ లో ప‌ర్య‌టిస్తున్నారు మోదీ. శ‌నివారం గుజ‌రాత్ కు చేరుకున్నారు ప్ర‌ధాన మంత్రి(PM Narendra Modi). ఈ సంద‌ర్బంగా రాజ్ కోట్ , గాంధీ న‌గ‌ర్ ల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు.

త‌న సొంత రాష్ట్ర గుజ‌రాత్ లో రెండు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. రాజ్ కోట్ లో కొత్త‌గా ఏర్పాటు చేసిన మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రిని మోదీ ప్రారంభించారు. క‌రోనా క‌ష్ట కాలంలో ఆరోగ్యం ప్రాధాన్య‌త ఏమిటో ప్ర‌తి ఒక్క‌రికి తెలిసింద‌న్నారు మోదీ.

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, స‌హ‌కార సంఘాలు, రైతుల సంక్షేమం పై కేంద్ర ప్ర‌భుత్వం ఎక్కువ‌గా దృష్టి సారిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi).

గాందీన‌గ‌ర్ లో ఇవాళ స‌హ‌కార్ సే సమృద్ధి కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. స‌హ‌కార సంస్థ‌ల నుండి 7,000 మందికి పైగా ప్ర‌తినిధులు ఇందులో పాల్గొంటార‌ని మోదీ తెలిపారు.

Also Read : మోదీ కామెంట్స్ కుమార‌స్వామి సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!