Modi Tour : గుజ‌రాత్ పై మోదీ ఫోక‌స్ టూర్ ఫిక్స్

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్

Modi Tour : ఈ ఏడాది చివ‌ర‌లో గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల‌లో మ‌రోసారి బీజేపీ ప‌ట్టు నిలుపుకుంది.

పంజాబ్ లో కాంగ్రెస్ ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంది. ఇక ఆప్ ఈసారి ఫోక‌స్ పెడుతోంది పై రెండు రాష్ట్రాల‌లో.

దీంతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ త‌న స్వంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ పై ఫోక‌స్ పెట్ట‌నున్నారు.

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఇందులో భాగంగా ఈనెల 18 నుంచి అంటే

సోమ‌వారం నుంచి బుధ‌వారం దాకా మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే టూర్ మ్యాప్ సిద్దం చేసి ఉంచారు.

త‌దుప‌రి ఎన్నిక‌ల్లో కాషాయ జెండా ఎగుర వేయాల‌ని మ‌రోసారి డిసైడ్ అయ్యారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(Modi Tour).

ఆయ‌న సార‌థ్యంలోనే అఖండ భార‌తం మొత్తం కాషాయంతో నింపాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది బీజేపీ.

ఇక ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల అనంత‌రం గుజ‌రాత్ రాష్ట్రాన్ని సంద‌ర్శించ‌డం మోదీకి ఇది రెండోసారి.

టూర్ లో భాగంగా గాంధీన‌గ‌ర్ లోని పాఠ‌శాల‌ల‌కు సంబంధించిన క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ని సోమ‌వారం సాయంత్రం సంద‌ర్శిస్తారు.

19న ఉద‌యం దేవ‌ద‌ర్ లో బ‌నాస డెయిరీగా ప్ర‌సిద్ది చెందిన బ‌న‌స్కాంత జిల్లా కోఆప‌రేటివ్ మిల్క్ ప్రొడ్యూస‌ర్స్ యూనియ‌న్ లిమిడెట్ క్యాంపస్ కు శంకుస్థాప‌న చేస్తారు.

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిష‌న‌ల్ మెడిసిన్ కు ప్ర‌ధాని శంకుస్థాప‌న చేస్తారు.

20న ఉద‌యం గాంధీ న‌గ‌ర్ లోని మ‌హాత్మ‌మా మందిర్ క‌న్వెన్ష‌న్ అండ్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ , ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ 2022లో పాల్గొంటారు.

అనంత‌రం మారిష‌స్ ప్ర‌ధానితో మోదీ భేటీ కానున్నారు. దాహోద్, పంచ‌మ‌హ‌ల్ కు సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తారు. అనంత‌రం ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు.

Also Read : రాజీనామా కాదు మంత్రిని అరెస్ట్ చేయండి

Leave A Reply

Your Email Id will not be published!