Modi : బుద్దం శరణం గశ్చామి – నరేంద్ర మోదీ
నేపాల్ ను సందర్శించిన ప్రధాని
Modi : బుద్ధ పూర్ణిమ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ లో సోమవారం పర్యటించారు. నేపాల్ లోని అద్బుతమైన వ్యక్తుల మధ్య ఉండటం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు.
2014 నుంచి నేపాల్ లో ప్రధాని పర్యటించడం ఇది వరుసగా ఐదో సారి కావడం విశేషం. ఉత్తర ప్రదేశ్ లోని ఖుషీ నగర్ నుండి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని మోదీతో పాటు ఆయన పరివారం కూడా నేపాల్ కు చేరుకుంది.
నేపాల్ దేశ ప్రధాన మంత్రి షేర్ బహూదర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా నేపాల్ లో కాలు మోపిన మోదీకి(Modi) , పరివారానికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఇవాళ బుద్ద పూర్ణిమ సందర్భంగా నేపాల్ లోని పవిత్రమైన మాయా దేవి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ(Modi), నేపాల్ ప్రధాని దేవుబా తో కలిసి ప్రార్థనలు చేశారు.
గౌతమ బుద్దుని జన్మ స్థలమైన చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించడం తన జీవితంలో మరిచి పోలేని తీపి గుర్తుగా ఉండి పోతుందన్నారు మోదీ.
భారత ప్రధాన మంత్రి నేపాల్ పర్యటన అత్యంత ఆహ్లాదకరంగా ప్రారంభమైందని భారత ప్రధాన మంత్రి కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
బుద్ద పూర్ణిమ సందర్భంగా పాల్గొనడం ప్రధాన మంత్రిని అత్యంత సంతోషానికి గురి చేసిందని పేర్కొంది. లుంబినీలో సాదర స్వాగతం పలికినందుకు ధన్యావాదాలు తెలిపరు నరేంద్ర మోదీ.
ప్రార్థన అనంతరం లుంబిని డెవలప్ మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే బుద్ద జయంతి వేడుకల్లో ప్రధాని ప్రసంగిస్తారు.
Also Read : మరాఠాపై బీజేపీ జెండా ఎగరేస్తాం