PM Modi : శ్రీవారి సన్నిధిలో మోదీ
పీఎంకు సీఎం గ్రాండ్ వెల్ కమ్
PM Modi : తిరుమల – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి , ఎంపీలు మిధున్ రెడ్డి, గురుమూర్తి, రెడ్డెప్ప, జీవీఎల్ నరసింహారావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ చక్రవర్తి, ఎమ్మెల్యే వర ప్రసాద్ రావు పాల్గొన్నారు.
PM Modi in Tirumala
ప్రధాన మంత్రి రాక తో తిరుపతి, తిరుమలలో భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. మరో వైపు మోదీని చూసేందుకు భక్తులు, ప్రజలు బారులు తీరారు. ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతోంది.
సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. స్వామి వారి సేవకులు విస్తృతంగా సేవలలో మునిగి పోయారు. తిరుమల లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారికి సరైన సమయంలో శ్రీవారి, అమ్మ వారి దర్శనం కలుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
Also Read : Sihmachalam : నృసింహ మండల దీక్షలు ప్రారంభం