PM Modi Smriti Van : స్మృతి వనం ప్రారంభానికి సిద్దం
దేని కోసం ఇంతటి ప్రాముఖ్యం
PM Modi Smriti Van : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మృతి వాన్ (స్మృతి వాన్ )(PM Modi Smriti Van) ఆదివారం ప్రారంభం కానుంది. దీనిని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం ఇవ్వనున్నారు.
ఇంతకీ ఈ స్మృతీ వాన్ అంటే ఏమిటి. దీని వెనుక భుజ్ మెమోరియల్ కథేమిటో తెలుసు కోవాలని ఉంటుంది. 2001లో గుజరాత్ లో భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఆ తర్వాత ప్రజలు ప్రదర్శించిన ధృఢత్వ స్ఫూర్తిని గుర్తు చేసేందుకే ఈ స్మృతి వాన్ మెమోరియల్ ను ఏర్పాటు చేశారు. గుజరాత్ లోని భుజ్ జిల్లాలో 2001లో కచ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
ప్రపచంలో అతి పెద్ద భూకంపంగా ఇది గుర్తింపు పొందింది. రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలను బలిగొంది ఈ భారీ భూకంపం. దీనికి గుర్తుగా భుజ్ కేంద్రంగా ఉంది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ స్మారక చిహ్నం చిత్రాలను పంచుకుంటూ స్మృతి వాన్ కచ్ ప్రజల అద్భుతమైన పోరాట స్పూర్తిని కోల్పోయిన జీవితాలకు నివాళి అని పేర్కొన్నారు.
తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు మోదీ. విశాలమైన స్మారకం 470 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భూకంపం సందర్భంగా 13,000 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
వారందరి పేర్లను ఇందులో చేర్చారు. ఏడు బ్లాక్ లుగా విభజించారు. వీటికి పునర్జన్మ, రీ డిస్కవర్ , రీస్టోర , రీ బిల్డ్ , రీ థింక్ , రిలీవ్ , రెన్యూ పేరు పెట్టారు.
Also Read : లంకకు మద్దతు కావాలి ఒత్తిడి కాదు