PM Modi Putin : పుతిన్ తో పీఎం మోదీ కీలక భేటీ
ప్రధాన అంశాలకు చర్చకు వచ్చే ఛాన్స్
PM Modi Putin : భారత దేశ ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ ఎస్సీఓ సమ్మిట్ కోసం ఉజ్బెకిస్తాన్ లో శుక్రవారం రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కానున్నారు.
ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర రాజ్యం అమెరికా సైతం వీరిద్దరి మీటింగ్ పై ఫోకస్ పెట్టనుంది. మరో వైపు చైనా చీఫ్ జిన్ పింగ్ తో ప్రధాన మంత్రి మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
శిఖరాగ్ర సమావేశానికి మోదీతో పాటు పలువురు దేశాధినేతలు చేరుకున్నారు. మోదీ రష్యా, ఉజ్బెకిస్తాన్ , ఇరాన్ అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాదం, దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ఇతర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
అంతే కాకుండా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దాన్ని ఆపాలని గత కొంత కాలం నుంచీ భారత్ కోరుతోంది. దీని గురించి కూడా మోదీ ప్రత్యేకంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో(PM Modi Putin) చర్చించే అవకాశం ఉందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అంతే కాకుండా వ్యాపారం, వాణిజ్యం, ఆయిల్ కొరత, ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఉగ్రవాదంపై కూడా ఫోకస్ పెట్టనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
గతంలో కంటే గణనీయంగా రష్యాతో ఆయిల్ ను కొనుగోలు చేస్తోంది భారత్. దీనిపై ఇతర దేశాలు ప్రధానంగా అమెరికా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీనిని భారత్ తిప్పి కొట్టింది. మొత్తంగా మోదీ పాల్గొనే ఈ మీటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read : జిన్ పింగ్ తో విందుకు మోదీ దూరం