Congress Protest : ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే
పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్
Congress Protest Adani : పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అదానీ(Adani) వ్యవహారంపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ మండి పడింది కాంగ్రెస్ పార్టీ. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ పై ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ , రాజ్యసభ ఎంపీలు. పీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని ఎందుకు స్పందించడం లేదన్నారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీపై దూకుడు పెంచారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లి మాట్లాడుతుంటే పార్లమెంట్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తాము ఒప్పుకోమన్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐకి చెందిన డబ్బులను ఎలా అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టాయంటూ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల(Congress Protest Adani) సభ్యుల మధ్య వాగ్వాదం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. వాయునాడు ఎంపీ లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణిచి వేస్తున్న వారు దాని రక్షణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.
పీఎంతో జరిగిన కీలక సమావేశానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ , పీయూష్ గోయల్ , నితిన్ గడ్కరీ , కిరణ్ రిజిజు హాజరయ్యారు.
Also Read : నేను కాదు మోదీ క్షమాపణ చెప్పాలి