PM Narendra Modi : ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కు ప్రాముఖ్యతనిచ్చేలా ఉంటుంది
అన్ని అంశాలపై చర్చ జరగాలని సూచించారు...
Narendra Modi : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (శుక్రవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం లో, రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. అనంతరం, లోక్సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.
PM Narendra Modi Comment
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు, పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపించాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని అంశాలపై చర్చ జరగాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరగాలని ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని కోరారు. అలాగే, విపక్షాలు బిల్లులకు మద్దతు తెలపాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపారు. ఈ బడ్జెట్, వికసిత్ భారత్ సాధనకు సహాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
Also Read : Tanuku SI Suicide : స్టేషన్ లో తుపాకీతో కాల్చుకొని మరణించిన తణుకు ఎస్ఐ