PM Narendra Modi : మహారాష్ట్ర ఎన్డీయే ఎంపీలతో భేటీ అయిన ప్రధాని మోదీ
ముందే ఓ స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు అజిత్ పవార్ విజ్జప్తి చేశారని తెలుస్తుంది...
PM Narendra Modi : మహారాష్ట్ర అంసెబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలోని ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారితో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీ (అజిత్) అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బుధవారం న్యూడిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
PM Narendra Modi Meet
ఆ కొద్ది గంటలకే ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ(PM Narendra Modi) ఇలా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 80 నుంచి 90 సీట్లు కేటాయించాలని అమిత్ షాతో భేటీలో డిప్యూటీ సీఎం అజిత్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సీట్ల సర్ధుబాటు విషయంలో ఎన్నికల చివర నిమిషం వరకు కాకుండా.. ముందే ఓ స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు అజిత్ పవార్ విజ్జప్తి చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ చర్చించే అవకాశముందని సమాచారం.
మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చివర నిమిషంలో అజిత్ పవార్ పార్టీకి ఎంపీ సీట్లు కేటాయించింది. దాంతో సదరు ఎన్నికల్లో ఒకే ఒక్క ఎంపీ స్థానాన్ని అజిత్ పవార్ పార్టీ గెలుచుకుంది. దీంతో సీట్ల పంపకం విషయంలో ముందే స్పష్టత ఉండాలి అమిత్ షాకు ఆయన సూచించినట్లు సమాచారం. ఇక లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రంలో బీజేపీ కేవలం 9 స్థానాల్లో విజయం సాధించగా.. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాని మోదీతో భేటీలో మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులు నితీన్ గడ్కరీ, పీయూష్ గోయోల్ తదితరులు పాల్గొన్నారు. 288 ఎమ్మెల్యే స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : Ex CM KCR : ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిప్పులు చెరిగిన మాజీ సీఎం