PM Modi Telangana : మోడీ రాకకు ముహూర్తం ఫిక్స్
ఫిబ్రవరి 13న ప్రధాని టూర్ ఖరార్
PM Modi Telangana : ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఆయన ఈనెల లోనే తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల రీత్యా టూర్ ను క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉండగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్ రైలును సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కు వర్చువల్ గా ప్రధానమంత్రి ప్రారంభించారు.
తాజాగా మరో కీలక ప్రకటన వెలువరించింది ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం. ఈమేరకు నరేంద్ర మోడీ టూర్ ను ఖరారు చేసింది. ఈ మేరకు వచ్చే నెల ఫిబ్రవరిలో పర్యటించేందుకు తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 13న తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Telangana) పర్యటించనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి. అనంతరం భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు గాను పార్టీ కూడా స్థలాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే నిర్వహించిన పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి సభను నిర్వహించనుంది.
పైకి ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు అని చెబుతున్నా ప్రధానంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పాగా వేసేందుకు మోదీని ముందు పెడుతోంది పార్టీ. ఇప్పటికే దక్షిణాదిన కాషాయ జెండా ఎగుర వేయాలన్నది మోదీ, అమిత్ షా కల. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది.
Also Read : ఖుష్ కబర్ పంతుళ్లు పారా హుషార్