Modi : భారత దేశం గర్వించ దగిన గాన కోకిలగా పేరొందిన లతా మంగేష్కర్ ఇటీవలే కన్ను మూశారు. 92 ఏళ్ల వయసు ఉన్న లత అంటే వల్లమాలిన అభిమానం ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి(Modi ). లత అంత్యక్రియలకు సైతం ఆయన హాజరయ్యారు.
తన ప్రేమను చాటుకున్నారు. తను ప్రాణప్రదంగా అభిమానించే దీదీని కోల్పోవడం బాధాకరమని కన్నీటి పర్యంతం అయ్యారు మోదీ(Modi ). ఇదిలా ఉండగా లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును మొదటిసారిగా అందుకోనున్నారు ప్రధాని.
ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది కమిటీ. ఈ ఏడాది ప్రారంభంలో కన్ను మూసిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం, గౌరవార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా ఈనెల 24న జరగనున్న 80వ వార్షిక మాస్టర్ దీనా నాథ్ మంగేష్కర్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈ అవార్డుతో సత్కరించనున్నారు.
మాస్టర్ దీనా నాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ అవార్డుకు మోదీని ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది.
మన దేశానికి , సమస్త ప్రజలకు, సమాజానికి మార్గ నిర్దేశనం చేసిన, అద్భుతమైన , ఆదర్శ ప్రాయమైన సేవలను అందించిన వ్యక్తికే ఈ అవార్డు ఇస్తామని తెలిపింది.
అందుకు మోదీ అర్హుడని పేర్కొంది. ఈ అవార్డును ప్రతి ఏటా ఇస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇక మోదీ గురించి ప్రస్తావించింది. మోదీ ఒకే ఒక్కడు.
వేల సంవత్సరాల ఉజ్వల చరిత్రలో మన దేశం చూసిన గొప్ప నాయకుల్లో ప్రధాని ఒకరు అని పేర్కొంది.
Also Read : ప్రధాని మోదీకి షెహబాజ్ షరీఫ్ థ్యాంక్స్