PM Modi Stops : తల్లి చిత్ర పటం కోసం కారు ఆపిన పీఎం
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో రోడ్ షో లో మోదీ
PM Modi Stops : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏది చేసినా అంది సంచలనమే. అందుకే ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాధిపతులలో, నాయకులలో టాప్ లో ఉన్నారు ప్రధాన మంత్రి.
తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది హిమాచల్ ప్రదేశ్ లో. ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు మోదీ. సిమ్లాలో భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ ర్యాలీ చేపట్టింది.
రిడ్జ్ మైదాన్ కు వెళ్లే రహదారి పూర్తిగా ప్రధాన మంత్రిని చూసేందుకు జనంతో పాటు చిన్నారులు, యువతీ యువకులు వేచి ఉన్నారు. భారీ ఎత్తున స్వాగతం పలికారు మోదీకి.
ఇదే సమయంలో ఓ బాలిక అరుదైన చిత్ర పటాన్ని పట్టుకుని నిలిచి ఉన్నది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి మోదీ(PM Modi Stops) చూసి గమనించారు. ర్యాలీలో వెళుతున్న మోదీ వెంటనే ఆగారు.
ఆయనే స్వయంగా చిత్రపటం చేతిలో పట్టుకున్న బాలిక వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ చిత్ర పటంలో ఉన్నది ఎవరో కాదు.
సాక్షాత్తు పెయిటింగ్ గీసిన చిత్రం ఎవరిదో కాదు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తల్లి హీరా బెన్ మోదీది. దాంతో ఆయన సంతోషానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ముచ్చట పడిన మోదీ చిత్రాన్ని గీసిన బాలికను అడిగారు. ఎన్ని రోజుల్లో గీశావని. పీఎం ప్రశ్నకు ఆ బాలిక తాను కేవలం ఒకే ఒక రోజులో గీశానని చెప్పింది.
తాను సిమ్లాకు చెందిన దానినని, దీనిని ప్రత్యేకంగా మీ కోసం గీశానని తెలిపింది. అంతే కాకుండా తాను స్వయంగా పీఎం చిత్ర పటాన్ని రూపొందించానని, దానిని డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ద్వారా పంపినట్లు పీఎం మోదీకి తెలిపింది.
Also Read : రాజ్యసభ బరిలో జీ సుభాష్ చంద్ర