PM Wickremesinghe : ఆదుకున్నందుకు మోదీకి థ్యాంక్స్
శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే
PM Wickremesinghe : ద్వీప దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో పరిస్థితి ఎంతకూ సద్దుమణుగక పోవడంతో ప్రధాన మంత్రిగా ఉన్న మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు.
ప్రాణ భయంతో ఆయన నేవీ స్థావరంలో తలదాచు కుంటున్నారు. దీంతో ఆ దేశ సర్వోన్నత న్యాయ స్థానం మహింద రాజపక్సే తో పాటు మరో 15 మంది నాయకులు ఎవరూ కూడా దేశం విడిచి వెళ్ల కూడదంటూ నిషేధం విధించింది.
ఈ తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మరోసారి ప్రధాన మంత్రి పదవి పగ్గాలు అప్పగించారు శ్రీలంక అధ్యక్షుడు గొటబొయి రాజపక్సే రణిలే విక్రమ సింఘేకు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విక్రమ సింఘే(PM Wickremesinghe) మాట్లాడారు.
తమ దేశం పట్ల మొదటి నుంచీ భారత దేశం స్నేహ పూర్వకంగా ఉందన్నారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయం చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకు పోయిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు, రాజకీయ గందరగోళానికి తెర దించేందుకు ఆయన పదవి చేపట్టారు.
73 ఏళ్ల రణిలే పై ఇప్పుడు యావత్ దేశం ఎదురు చూస్తోంది. శ్రీలంకకు 3 బిలియన్ డాలర్ల సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. సంక్షోభ సమయంలో మోదీ(PM Wickremesinghe) చేసిన సాయం మరువ లేమన్నారు.
తన పదవీ కాలంలో భారత్ తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ప్రజాస్వామ్య ప్రక్రియలకు అనుగుణంగా ఏర్పడిన కొత్త శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము ఎదురు చూస్తున్నామని భారత్ తెలిపింది.
Also Read : శ్రీలంక ప్రధానిగా రనీల్ విక్రమ సింఘే