Imran Khan : పాకిస్తాన్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఖాన్ వర్సెస్ షెహబాజ్ షరీఫ్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అవిశ్వాస తీర్మానంలో బలం నిరూపించు కోలేక పోయిన ఇమ్రాన్ ఖాన్(Imran Khan )తన పదవికి రాజీనామా చేశారు.
ఇక తాను అడుగు పెట్టనంటూ శపథం చేశారు. తాను తప్పు కోవడం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందంటూ ఆరోపించాడు. అంతే కాదు అమెరికా కుట్ర దాగి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
దీనిపై అమెరికా బహిరంగంగానే ఖండించింది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్(Imran Khan )తాను చైనా, రష్యాలతో స్నేహం కలిగి ఉన్నందు వల్లనే దానిని జీర్ణించు కోలేక పోయిందంటూ యుఎస్ పై నిప్పులు చెరిగారు.
పాకిస్తాన్ ను కొన్ని తరాల పాటు దోచుకున్న వాళ్లు తనను విమర్శించడం దారుణమన్నారు. ఇదే సమయంలో తన మాజీ భార్య రెహమ్ ఖాన్ పై కూడా విరుచుకు పడ్డారు ఇమ్రాన్ ఖాన్.
పనిలో పనిగా ఖాన్ దేశమంతటా పర్యటిస్తానని, ప్రజల వద్దకు వెళతానంటూ ప్రకటించారు. ఆ మేరకు ఆయన బహిరంగ సభలు చేపడుతూ తాను ఎలా దిగి పోవాల్సి వచ్చిందో చెబుతూ వస్తున్నారు.
ఈ తరుణంలో ప్రస్తుత పీఎం షెహబాజ్ పై దుర్భాషలాడారంటూ ఇమ్రాన్ ఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 150 మందిపై కేసు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు .
దీనిపై స్పందించార మాజీ ప్రధాన మంత్రి. తాను ఎవరినీ కించ పరిచేలా మాట్లాడ లేదన్నారు.
Also Read : పోర్న్ చూసిన యుకె ఎంపీ రాజీనామా