Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ బెదిరింపు పై కేసు నమోదు
సమర్థించిన బ్రదర్ అసదుద్దీన్ ఓవైసీ
Akbaruddin Owaisi : హైదరాబాద్ – ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమయం అయిపోయిందని చెప్పిన ఎస్ఐ పై నోరు పారేసుకున్నారు. దీనిపై ఈసీ సీరియస్ అయ్యింది. బహిరంగంగా బెదిరించడం , దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో అక్బరుద్దీన్ ఓవైసీపై(Akbaruddin Owaisi) కేసు నమోదు చేశారు.
Akbaruddin Owaisi Police Case
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఓవైసీ ఇలా బహిరంగంగా నోరు పారేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. చంద్రాయణగుట్టలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లలితాబాగ్ లో ప్రసంగిస్తుండగా సమయం అయిపోయిందంటూ ముగించాలని కోరారు అక్కడ పర్యవేక్షిస్తున్న ఎస్ఐ శివచంద్ర.
ఇంకా 5 నిమిషాలు ఉండగానే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహంతో ఊగి పోయారు అక్బరుద్దీన్ ఓవైసీ. తనను ఆపే మగోడు ఇంకా పుట్టలేదంటూ మండిపడ్డారు. తనకు ఇక్కడ పోటీయే లేదంటూ పేర్కొన్నారు. కేవలం పోలీసులే తనకు అడ్డంకిగా మారారంటూ ఆరోపించారు.
అయితే తమ్ముడి ప్రవర్తనను సమర్థించారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : ED Raids : వినోద్..మాజీ క్రికెటర్లకు షాక్