Naveen Reddy Custody : నవీన్ రెడ్డి కస్టడీ కోసం పిటిషన్
కోర్టులో పోలీసుల పిటిషన్ దాఖలు
Naveen Reddy Custody : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడ డాక్టర్ వైశాలిరెడ్డి కిడ్నాప్ కేసులో ఎట్టకేలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి అరెస్ట్ చేశారు(Naveen Reddy Custody) పోలీసులు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమకు వారం రోజుల పాటు అప్పగించాలని కోరారు. కస్టడీలోకి తీసుకుంటే ఇంకొన్ని వివరాలు తెలుస్తాయని ఇందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనను వద్దన్నందుకే కసి పెంచుకున్నట్లు చెప్పాడు. వైశాలీ స్నేహితురాలి ద్వారా తనకు స్నేహం కుదిరిందని తెలిపాడు పోలీసుల విచారణలో. పరిచయం ప్రేమగా మారిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఉందని ప్రపోజ్ చేశానని చెప్పాడు.
తీరా తన పెళ్లిని కాదందని, ఆపై పేరెంట్స్ కు చెప్పి చూశానని కానీ వారు కూడా ఒప్పు కోలేదని పేర్కొన్నాడు. తాను ఎంతగా నచ్చ చెప్పినా, బతిమాలినా ఒప్పు కోలేదన్నాడు. దీంతో తనకు మరింత కోపం, కసి పెరిగిందని తెలిపాడు. ఆమె ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకున్నానని, వేధించినట్లు కూడా ఒప్పుకున్నాడు.
ఫేక్ ఇన్ స్టా గ్రామ్ క్రియేట్ చేసింది కూడా నిజమేనని ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక వైశాలీకి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకుని దాడికి పాల్పడ్డాడనని కావాలని చేయలేదన్నాడు.
తన వద్ద పని చేసే వారితో కలిసి దాడికి పాల్పడ్డామని, ఫర్నీచర్ ధ్వంసం చేసిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా నవీన్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.
Also Read : 26న తెలంగాణకు రాష్ట్రపతి రాక