Police Search : హైదరాబాద్ లో పబ్ లు..బార్లపై దాడులు
పెద్ద ఎత్తున పోలీసుల సోదాలు
Police Search : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు పోలీసులు దూకుడు పెంచారు. ఆయన పోలీసు శాఖను ప్రక్షాళన చేశారు. పోలీస్ శాఖలో నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన అధికారిగా పేరు పొందిన సీనియర్ ఐపీఎస్ లను నియమించారు. ఆరు నూరైనా సరే డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని తాజాగా సమీక్షలో స్పష్టం చేశారు.
Police Search on Pubs and Bars
ఇక సిటీ పోలీస్ కమిషనర్ గా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ లో గత ప్రభుత్వ హయాంలో పబ్ కల్చర్ పెరిగింది. పదుల సంఖ్యలో ఉన్న పబ్ లు, బార్లు గులాబీ నేతల సపోర్ట్ తో వందల సంఖ్యలో కొలువు తీరాయి. దీంతో డ్రగ్స్ , మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభించడం, నేరాలు పెరగడంతో దీనిపై ఫోకస్ పెట్టనున్నట్లు ప్రకటించారు సీపీ శ్రీనివాస్ రెడడ్ఇ.
శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో నగరంలోని పబ్ లు, బార్లు నిండి పోయాయి. దీంతో ఉన్నట్టుండి పోలీసులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు. విస్తృతంగా సోదాలు చేపట్టారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్ లోని పలు పబ్ లు, బార్ లలో స్నిఫర్ డాగ్స్ తో పరిశీలించారు.
ఈ సందర్బంగా బ్రీత్ అనలైజర్ లాగా డ్రగ్స్ అనలైజర్ లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తంగా ఖాకీల దాడులతో మందు బాబులు, పబ్ లు, బార్ల యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Also Read : CM Revanth Reddy : 21న జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష