Ponguleti Srinivas Reddy : కేసీఆర్ జ‌మానా దోపిడీకి చిరునామా

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy : ఖ‌మ్మం – మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నేల‌కొండ‌ప‌ల్లిలో జ‌రిగిన స‌భ‌లో నిప్పులు చెరిగారు. రోజుకో అబ‌ద్దం చెబుతూ తెలంగాణ పేరుతో లెక్క‌లేనంత ఆస్తుల‌ను పోగేసుకున్నాడంటూ కేసీఆర్ పై మండిప‌డ్డారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబం అంతులేని అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Ponguleti Srinivas Reddy Slams KCR

ప్ర‌జ‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. లేక‌పోతే మీకు ఇక భ‌విష్య‌త్తు అంటూ ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే అన్ని వ‌న‌రుల‌ను దోచుకున్నాడ‌ని, ఇక మిగిలింది ప్ర‌జ‌లు మాత్ర‌మేన‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు.

మ‌రోసారి గెలిపిస్తే ఇక మీ భ‌విష్య‌త్తును మీరే నాశ‌నం చేసుకున్న వార‌వుతార‌ని , హ‌స్తం కు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని పిలుపునిచ్చారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). ఈ ప‌దేళ్ల కాలంలో రాష్ట్రానికి రూ. 5 ల‌క్ష‌ల కోట్ల అప్పులు మిగిల్చాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సీఎం కేసీఆర్ ను , ఆయ‌న కుటుంబాన్ని ఫామ్ హౌస్ కే ప‌రిమితం చేయాల‌ని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ. ఇదిలా ఉండ‌గా శ్రీ‌నివాస్ రెడ్డికి పార్టీ పాలేరు టికెట్ ను కేటాయించింది. తుమ్మ‌ల‌కు ఖ‌మ్మం సీటు అప్ప‌గించింది.

Also Read : Gudivada Amarnath : త‌ప్పు చేసి దాడులు చేస్తే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!