Ponniyin Selvan Teaser : ‘పొన్నియిన్ సెల్వ‌న్’ టీజ‌ర్ అదుర్స్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Ponniyin Selvan Teaser : భార‌తీయ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపు దిద్దుకుంటున్న పొన్నియిన్ సెల్వ‌న్ మూవీ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్ , టీజ‌ర్ కు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌స్తోంది.

ఇక టీజ‌ర్(Ponniyin Selvan Teaser) కు మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ ల‌భించ‌డం విశేషం. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్ తో పెళ్లి అనంత‌రం చారిత్రాత్మ‌క చిత్రంలో న‌టించ‌డం ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్ కు తొలి సారి కావ‌డం విశేషం.

త‌న రాబోయే చిత్రం గురించి ఆమె పంచుకున్నారు. అద్భుతంగా ఉంది ఆమె పోస్ట‌ర్. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. సినిమాకు కొత్త అర్థం చెప్పిన మ‌ణిర‌త్నం ఈ సినిమాను మ‌రింత అర్థ‌వంతంగా తీశాడు.

ఆ రిచ్ నెస్ సినిమా టీజ‌ర్ లో అడుగ‌డుగునా క‌నిపించింది. ఇక ఈ చిత్రానికి ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన సంగీత దిగ్గ‌జం ఎఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంధ్ర ధ‌న‌స్సు, మెరుపు, హృద‌యంతో స‌హా అనేక ఎమోజీల‌తో పాటు ఐశ్వ‌ర్య రాయ్ దీనిని త‌న ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

నెటిజన్లు ఆమె అందానికి మ‌రోసారి ఫిదా అయ్యామంటూ పేర్కొన్నారు. ఈ క‌ళాఖండం కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నామ‌ని మ‌రికొంద‌రు తెలిపారు.

నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఐశ్వ‌ర్య రాయ్ పొన్నియిన్ సెల్వ‌న్ లో న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలో విక్ర‌మ్ , కార్తీ, ప్ర‌కాశ్ రాజ్ , జ‌యం ర‌వి, త్రిష కృష్ణ‌న్ , మోహ‌న్ బాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌ణిర‌త్నం ద‌గ్గ‌ర ప‌ని చేయ‌డం అంటే మ‌ళ్లీ పాఠ‌శాల‌కు వెళ్ల‌డం లాంటిద‌ని పేర్కొన్నారు ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్.

Also Read : జ్యూరీ తీర్పుపై మ‌రోసారి అంబ‌ర్ కోర్టుకు

Leave A Reply

Your Email Id will not be published!