Pooja Vstrakar : భారీ సిక్స్ తో పూజా వ‌స్త్రాక‌ర్ రికార్డ్

స్మృతి మంధాన ..క్లో టైరాన్ రికార్డు బ్రేక్

Pooja Vstrakar  : భార‌త్ కు చెందిన విమెన్ క్రికెట‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్ మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో భారీ సిక్స్ కొట్టారు. ఆమె కేవ‌లం 28 బంతులు ఎదుర్కొని 34 ప‌రుగులు చేసింది ఇవాళ ఆసిస్ తో జ‌రిగిన మ్యాచ్ లో.

81 మీట‌ర్ల దూరంలో ఈ సిక్స్ కొట్టారు పూజా. దీనికి సంబంధించిన బిగ్ సిక్స్ ఫోటో, వీడియోను ట్విట్ట‌ర్, ఇన్ స్టా వేదికగా ఐసీసీ షేర్ చేసింది. ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త ఓట‌మి పాలైంది. భార‌త ఇన్నింగ్స్ లో కెప్టెన్ మిథాలీ రాజ్ , యాస్తికా భాటియా హాఫ్ సెంచ‌రీలు సాధించారు. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ , పూజా వ‌స్త్రాక‌ర్ (Pooja Vstrakar )ఆఖ‌రులో దంచి కొట్టారు.

భార‌త జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 277 ప‌రుగులు చేసింది.ఆసిస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపింది పూజా వ‌స్త్రాక‌ర్. ఇక మ‌హిళ‌ల ప్ర‌పంచ క్రికెట్ లో భారీ టార్గెట్ ను చేదించి రికార్డు సృష్టించింది ఆస్ట్రేలియా జ‌ట్టు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో పూజా వ‌స్త్రాక‌ర్ (Pooja Vstrakar )కొట్టిన ఈ సిక్స్ అతి పెద్ద‌ద‌ని స్ప‌ష్టం చేసింది ఐసీసీ. భార‌త్ ఇన్నింగ్స్ లో 49వ ఓవ‌ర్ లో వ‌స్త్రాక‌ర్ ఆసిస్ పేస‌ర్ మేగాన్ షుట్ బంతిని లాంగ్ ఆన్ పై భారీ సిక్సర్ కొట్టింది.

హ‌ర్మ‌న్ ప్రీత్ తో క‌లిసి 50 ర‌న్స్ భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసింది పూజా వ‌స్త్రాక‌ర్. గ‌తంలో క్లో టైరాన్ , స్మృతి మంధానలు 80 మీట‌ర్ల సిక్స‌ర్ల‌ను దాటేసింది.

Also Read : భార‌త్ పై విక్ట‌రీ సెమీస్ కు ఆసిస్

Leave A Reply

Your Email Id will not be published!