Pope Francis : యావత్ ప్రపంచం ఇవాళ తల దించుకుని చూస్తోంది. ఎందుకంటే రష్యా యుద్దాన్ని ప్రకటించడం. పైగా ఉక్రెయిన్ పై సైనిక చర్య మాత్రమే చేపట్టానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
యుద్దం ఎన్నటికీ పరిష్కారం కాదు. అంతకంటే ఆమోద యోగ్యం కూడా కాదు. దీనిని ఏ ఒక్కరూ హర్షించరు. నరుక్కుంటూ పోతే చెట్లు ఉండవు. చంపుకుంటూ పోతే మనుషులు మిగలరు. అధికారం, దేశం, పదవులు, ఆర్భాటాలు ఏవీ శాశ్వతం కావు.
ఒక దేశానికి ప్రతినిధిగా ఉన్న వాళ్లు ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగడం మంచిది కాదు. అత్యంత హేయ్యమైన, అమానవీయకర సంఘటన దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను.
ప్రపంచానికి శాంతి కావాలి యుద్దం కాదని పేర్కొన్నారు పోప్ ఫ్రాన్సిస్(Pope Francis). రష్యా దండయాత్రగా ఆయన అభివర్ణించారు. ఈ దాడుల ద్వారా, అమాయకులను చంపడం ద్వారా మీరు ఈ లోకానికి ఏం చెప్ప దల్చుకున్నారో స్పష్టం చేయాలని , ఒకసారి పునరాలోచించు కోవాలని సూచించారు రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కు.
ఈ దాడుల నుంచి పూర్తిగా వైదొలగాలని, సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవాలని సూచించారు పోప్. రాజకీయాలు విష పూరితమై, నేర పూరితమైనప్పుడే ఇలాంటి ఘటనలు, దాడులు చోటు చేసుకుంటాయి.
మానవత్వం వైఫల్యం చెందడం వల్లనే ఇలా జరిగిందని నేను అనుకుంటున్నానని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి యుద్దం మన ప్రపంచాన్ని మునుపటి కంటే దారుణంగా వదిలి వేస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పోప్ తన బాధను రష్యన్ భాషలో ట్వీట్ చేయడం విశేషం.
Also Read : పుతిన్ తో చర్చలకు సిద్దం