Jairam Ramesh : రాహుల్ గాంధీ యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ

పార్టీ మ‌రింత బలోపేతం అవుతుంది

Jairam Ramesh :  క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది.

ఉద‌యం 6.30 గంట‌ల నుండి సాయంత్రం దాకా ఈ యాత్ర జ‌రుగ‌తుఉంది. రాహుల్ గాంధీకి అడుగ‌డుగునా జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఈ యాత్ర రిహార్స‌ల్ గా ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు రాహుల్ గాంధీ. ప‌నిలో ప‌నిగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని, బీజేపీని, ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేశారు.

త్రివ‌ర్ణ ప‌తాకం 133 కోట్ల భార‌తీయుల‌ద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌లైన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ ప‌రిష‌త్ , భ‌జ‌రంగ్ ద‌ళ్ ది కాద‌ని స్ప‌ష్టం చేశారు.

ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించకుండా మోదీ ప‌వ‌ర్ ను ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర వ‌ల్ల కాంగ్రెస్ పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జ్ జైరాం ర‌మేష్‌(Jairam Ramesh) .

పార్టీకి నూత‌న జ‌వ‌స‌త్వాలు స‌మ‌కూరుతాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌త్య‌ర్థులు, భాగ‌స్వామ్య ప‌క్షాలు త‌మ పార్టీని తేలిక‌గా తీసుకునే అవ‌కాశం ఏమాత్రం ఉండ‌ద‌ని చెప్పారు.

ఈ యాత్ర పార్టీకి ప్రాణం పోసే సంజీవిని లాంటిద‌న్నారు. ఈ యాత్ర 3,570 కిలోమీట‌ర్లు సాగుతుంది. రాహుల్ గాంధీతో పాటు పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, బాధ్యులు కూడా పాల్గొంటున్నారు.

ఈ యాత్ర కాంగ్రెస్ పున‌రుద్ద‌ర‌ణ‌కు ఉప‌క‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు జైరాం రమేష్.

Also Read : ప్రశ్నించే గొంతుల‌పై మోదీ ఉక్కుపాదం

Leave A Reply

Your Email Id will not be published!