Posani Krishna Murali: పోసానికి మార్చి 20 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
పోసానికి మార్చి 20 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
Posani Krishna Murali : వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి(Posani Krishna Murali) ఈనెల 20 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీటీ వారెంట్ పై శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈనెల 20వరకు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ‘‘నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ఒకే విధమైన కేసులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారు. నేను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా. గుండె జబ్బు, పక్షవాతం లాంటి రుగ్మతలు ఉన్నాయి’’ అని కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా న్యాయాధికారికి పోసాని(Posani Krishna Murali) తెలిపారు. అయితే పీటీ వారెంట్ పై వచ్చినందును అలా ఆదేశించే అధికారం ఈ కోర్టుకు లేనట్లు న్యాయమూర్తి తెలిపినట్లు తెలుస్తోంది.
Posani Krishna Murali Case Updates
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులు, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను పీటీ వారెంట్ పై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విజయవాడ కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. దీనితో ఆయన్న మళ్లీ కర్నూలు జైలుకు తరలించనున్నారు.
పోసాని అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి శుక్రవారం పలు జిల్లాల్లో వాదనలు జరిగాయి. కర్నూలు జిల్లా ఆదోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం సాయంత్రం పోసాని కేసుపై వాదనలు ముగిశాయి. పోసాని వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు జీవన్‌సింగ్, పి.సువర్ణ రెడ్డి వాదనలను వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో అక్రమంగా కేసులు బనాయించారని కోర్టుకు తెలిపారు. నిందితుడు పోసాని వాడిన పదజాలం చాలా తీవ్రమైనవని ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మహేశ్వరి వాదనలు వినిపించారు. ఆయన మాటలు బాధితుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా పోసానిని రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైనా విచారణ సోమవారానికి వాయిదా పడింది.
Also Read : Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?