Posani Krishna Murali: పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు జిల్లా కోర్టు
పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు జిల్లా కోర్టు
Posani Krishna Murali : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండు రోజుల క్రితమే అతడి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగ్గా… తీర్పును కోర్టు మార్చి 21వ తేదీకి రిజర్వు చేసింది. తాజాగా శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
Posani Krishna Murali Got Bail from..
పోసాని బెయిల్ కోసం రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదనే నిబంధనలు విధించింది. అంతేకాదు వారానికి రెండు సార్లు సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిందిగా ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో పోసాని(Posani Krishna Murali) జైలు నుంచి శనివారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణ మురళిపై(Posani Krishna Murali) రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తన నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీకు తరలించారు. మొదట అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో కృష్ణమురళీను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా… రిమాండ్ విధించారు.
అయితే వారం రోజుల తరువాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో… రాష్ట్రంలో పలుచోట్ల నమోదైన కేసుల్లో పోసానిని పీటీ వారెంట్ పై ఆయా స్టేషన్లకు, వాటి పరిధిలో ఉన్న కోర్టులకు తరలించారు. అయితే అన్ని కోర్టుల్లో బెయిల్ మంజూరు కావడంతో… గుంటూరు జైలు నుండి విడుదలైన పోసానిని… చివరకు సీఐడీ పోలీసులు అనూహ్యంగా అరెస్ట్ చేసారు. ప్రస్తుతం పోసాని గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇప్పుడు తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రాష్ట్రంలో పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోదు అయిన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేక బెయిల్‌పై విడుదల అవుతారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు (శనివారం) ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Bomb Threat: తిరుపతిలో బాంబు కలకలం ! కలెక్టరేట్ కు బెదిరింపు మెయిల్ !