Prince William Kate : మారనున్న పదవులు..హోదాలు
క్వీన్ ఎలిజబెత్ మరణంతో మార్పులు
Prince William Kate : సుదీర్ఘ కాలం పాటు యుకెకు రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ -2 కన్ను మూశారు. ఆమెకు 96 ఏళ్లు. ఇక రాజసౌధంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
అంతే కాకుండా ఎలిజబెత్ కుటుంబంలోని వారి పదవులు, హోదాలలో మార్పులు జరగనున్నాయి. ప్రిన్స్ విలియమ్ , కేట్ మిడిల్టన్ కొత్త బిరుదులు పొందేందుకు సిద్దమయ్యారు.
ప్రిన్స్ విలియం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ , డ్యూక్ ఆఫ్ కార్నివాల్ గా పరిగణించ బడతారు. ఆయన భార్య కేట్ మిడిల్టన్ వేల్స్(Prince William Kate) యువరాణి కానున్నారు. రాణి మరణానికి ముందు ప్రిన్స్ విలియం డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి బిరుదును కలిగి ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే గౌరవం ( బిరుదు) రాణి వారసుల కోసం రిజర్వ్ చేయబడింది. ప్రస్తుతం రాజుగా ఉన్న చార్లెస్ దానిని కలిగి ఉన్నారు. ఇక ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అనే బిరుదను చివరిసారిగా ప్రిన్సెస్ డయానా కలిగి ఉన్నారు.
ఆమె అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమెది సహజ మరణం కాదని దాని వెనుక కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. చార్లెస్ భార్య డచెస్ కెమిల్లా దానిని గౌరవంగా ఉపయోగించ కూడదని నిర్ణయించుకుంది.
కింగ్ అండ్ ది క్వీన్ కన్సార్ట్ ఈ సాయంత్రం బాల్మోర ల్ లో ఉంటారు. రేపు లండన్ కు తిరిగి వస్తారు. ఇదిలా ఉండగా చార్లెస్ వయస్సు 73 ఏళ్లు. చని పోయిన ఎలిజబెత్ -2 కు పెద్ద కుమారుడు. స్వయం చాలకంగా యునైటెడ్ కింగ్ డమ్ కు రాజు అవుతాడు.
ఆస్ట్రేలియా, కెనడా , న్యూజిలాండ్ తో సహా 14 ఇతర రంగాలకు చీఫ్ గా ఉంటారు. ఆయన భార్య కెమిల్లా క్వీన్ కన్సార్ట్ అవుతుంది.
Also Read : ప్రిన్స్ ఎలిజబెత్ స్థానంలో చార్లెస్