Ricky Skerritt : విండీస్ నిష్క్రమణపై పోస్టుమార్టం
విండీస్ క్రికెట్ బోర్డు చీఫ్ రికీ స్కెరిట్
Ricky Skerritt : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ -2022 నుంచి అనూహ్యంగా నిష్క్రమించింది వెస్టిండీస్. ఇదే జట్టు రెండు సార్లు అంతర్జాతీయ వరల్డ్ కప్ ను రెండుసార్లు గెలుచుకుంది. తాజాగా నికోలస్ పూరన్ సారథ్యంలోని విండీస్ సూపర్ -12కు వెళ్లకుండానే వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విండీస్ ఎందుకు ఓడి పోయిందనే దానిపై చర్చ జరిగింది. ప్రధానంగా అనామక జట్టుగా భావించిన ఐర్లాండ్ టీం చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అత్యంత బలమైన జట్టుగా పేరొందిన విండీస్ ఎందుకు ప్రధానమైన టోర్నీలో చతికిల పడిందనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది విండీస్ క్రికెట్ బోర్డు.
లోపం ఎక్కడుందనే దానిపై పూర్తిగా పోస్టుమార్టం చేస్తామని ఆ దేశ బోర్డు చీఫ్ రికీ స్కెరిట్(Ricky Skerritt). ఈ మేరకు కీలకమైన ప్రకటన చేశాడు. నిరాశజనకంగా ప్రదర్శన చేపట్టడంపై ఫోకస్ పెడతామని తెలిపారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దానిపై ఫోకస్ పెడతామని , జట్టును మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తమ జట్టుకు చెందిన బ్యాటర్లు ప్రధానంగా బౌలర్లను ఎదుర్కోలేక పోవడం ఒకింత తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే టోర్నీలు, సీరీస్ లలో మరింత మెరుగైన ప్రదర్శన చేపట్టేందుకు జట్టును సన్నద్దం చేస్తామని వెల్లడించారు. టోర్నీలో విండీస్ స్కాట్లాండ్ , ఐర్లాండ్ లపై ఓడి పోగా జింబాబ్వేపై మాత్రమే విజయం సాధించింది.
Also Read : సందీప్ పాటిల్ పై అమోల్ కాలే విక్టరీ