Arvind Kejriwal LG : మేయర్ ఎన్నిక వాయిదా చట్ట విరుద్దం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal LG : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన దేశ రాజధాని ఢిల్లీ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన మేయర్ , డిప్యూటీ మేయర్ , నామినేటెడ్ సభ్యుల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపి వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై(Arvind Kejriwal LG) నిప్పులు చెరిగారు.
ఏ పద్దతిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారంటూ ప్రశ్నించారు. తాము అనుకున్నట్లుగానే బీజేపీ మైండ్ గేమ్ ఆడిందంటూ ఆరోపించారు సీఎం. గత 15 ఏళ్లుగా ఢిల్లీని తమ గుప్పిట్లో ఉంచుకుని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీజేపీకి పవర్ లోకి రాక పోవడంతో ఇలా దొడ్డిదారిన ఎన్నిక కాకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని ప్రకటించారు. తాము వీలైతే న్యాయ నిపుణులను సంప్రదించి సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ప్రకటించారు సీఎం. ఎల్జీ పూర్తిగా బీజేపీ కార్యకర్తగా మారి పోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎంత సేపు ప్రభుత్వాన్ని అడ్డుకోవడం తప్ప ఇంకేమీ చేయడం లేదని మండిపడ్డారు కేజ్రీవాల్.
దేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో , ఎలా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారో చూశారంటూ పేర్కొన్నారు. ముందు బీజేపీ వాళ్లే తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.
Also Read : మానవత్వాన్ని మించిన మతం లేదు