Maharashtra CM : మరాఠా సీఎంపై కామెంట్స్..సీరియస్
వ్యక్తిగత దూషణలు చేసినందుకు కేసు
Maharashtra CM : సోషల్ మీడియా ఉంది కదా అని ఎలా పడితే అలా కామెంట్స్ చేయడం ఇక నుంచి కుదరదు. స్వేచ్ఛ ఉండడం మంచిదే కానీ దానిని దుర్వినియోగం చేసేందుకు వీలు లేదు. ఇప్పటికే ఐటీ చట్టాన్ని తీసుకు వచ్చింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. పలు కేసులు నమోదవుతున్నాయి దేశ వ్యాప్తంగా.
తాజాగా మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండేపై(Maharashtra CM) సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసినందుకు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. నిందితుడు ప్రదీప్ భాలేకర్ సీఎంను కించ పరిచేలా పదాలు వాడినట్లు ముంబై పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు అతడిని గుర్తించి కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , కేంద్ర మంత్రి నారాయణ్ రాణేలపై సోషల్ మీడియాలో కించ పరిచేలా కామెంట్స్ చేశారని పేర్కొన్నారు ముంబై పోలీసులు. ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించారు.
నిందితుడు ప్రదీప్ భాలేకర్ పై ముంబై లోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ లో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని 153ఎ, బి గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, 500 పరువు నష్టం , 504 ప్రజా శాంతికి భంగం కలిగించడం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా కేసు నమోదు చేశామని, నిందితుడు విషయం తెలుసుకుని పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేయడంతో మిగతా వారంతా తమ పోస్టులను తొలగించే పనిలో పడ్డారు.
Also Read : హిజాబ్ మహిళ ఎంఐఎం చీఫ్ అవుతుందా