Prajwal Revanna: పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి ! కారణం అదేనా ?
పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి ! కారణం అదేనా ?
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన ప్రజ్వల్ రేవణ్ణ అశ్వీల వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను(Prajwal Revanna) సిట్ పోలీసులు అరెస్ట్ చేసారు. మరోవైపు అతను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కి గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్.డీ రేవణ్ణ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే తాజాగా ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు.
Prajwal Revanna Mother..
రేవణ్ణ ఇంట్లో పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడటం… తరువాత ఆమెను కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) తల్లిదండ్రులు హెచ్.డి రేవణ్ణ, భవానీ రేవణ్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఆమెను ఇంటి వద్దే ఉండాలని సిట్ నోటీసులు జారీ చేసింది. దీనితో విచారించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా… ఆమె అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనితో ఇంటి పని సహాయకురాలి కిడ్నాపింగ్ కేసులో భవానీ రేవణ్ణ పాత్రను పరిశీలించాల్సి ఉంటుందని సిట్ వెల్లడించింది. ‘కేఆర్ నగర్ కిడ్నాప్ కేసుతో మీ పాత్రపై వివరణ కోసం మిమ్మల్ని మేం విచారిస్తాం. మీ అంగీకారం మేరకే వ్యక్తిగతంగా విచారణకు అందుబాటులో ఉండాలని మేం కోరాం. మహిళా పోలీసు అధికారులతో జూన్ ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు మిమ్మల్ని ప్రశ్నించేందుకు వస్తాం. మీరు ఇంట్లోనే ఉండాలని కోరతున్నాం’ అని సిట్ నోటీసుల్లో పేర్కొంది. దీనితో ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కన్పించలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం ఐదు గంటల వరకూ సిట్ అధికారులు ఇంటి వద్దే ఎదురు చూశారు. దీనితో ఆమె పరారీలో ఉన్నట్లు సిట్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.
కర్ణాటక హాసనలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుసటిరోజే ఈ అశ్లీల వీడియోల వ్యవహారం బయటికొచ్చింది. అప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ప్రజ్వల్ లొంగిపోవాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ సహా కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు చేరిన ప్రజ్వల్ రేవణ్ణ అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా… ఈనెల 6 వరకు సిట్ కస్టడీకి అప్పగించారు.
Also Read : INDIA Bloc: ఎగ్జిట్ పోల్స్ పై వెనక్కి తగ్గిన ‘ఇండియా’ కూటమి !