Prakash Raj Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ పనికి మాలిన సినిమా
దర్శకుడపై నిప్పులు చెరిగిన ప్రకాశ్ రాజ్
Prakash Raj Kashmir Files : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. మరోసారి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కాశ్మీర్ ఫైల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. బీజేపీ, హిందూత్వ సంస్థలు మండి పడుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ అవార్డు రాలేదంటూ వాపోయిన దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశ్ రాజ్(Prakash Raj Kashmir Files). అది షార్ట్ ఫిలింకు కూడా పనికి రాదని అది అసలు సినిమానే కాదని కుండ బద్దలు కొట్టారు.
ఆ సినిమాకు ఎవరు ఇన్వెస్ట్ చేశారో, ఎవరు దాని వెనుక ఉండి కథ నడిపించారో, ఎవరు దానిని ప్రమోట్ చేశారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు ప్రకాశ్ రాజ్ . ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదని ఎద్దేవా చేశారు నటుడు. ఈ సంచలన కామెంట్స్ కేరళ లోని తిరువనంతపుంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ -2023 ఈవెంట్ లో పాల్గొన్నారు ప్రకాశ్ రాజ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనే కలిసి నటించిన పఠాన్ మూవీపై పెద్ద ఎత్తున బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. విడుదలైన తర్వాత పఠాన్ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 700 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. ఇంకా జనం ఆ సినిమాను ఆదరిస్తున్నారు. నిషేధం విధించాలని యత్నించిన పఠాన్ కలెక్షన్ల వర్షం కురిపిస్తే బీజేపీ ప్రమోట్ చేసిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్ అందులో మూడో వంతు కూడా వసూలు చేయలేదన్నారు.
Also Read : లతా మంగేష్కర్ వీడి ఏడాది