Prashant Kishor : కాంగ్రెస్ గెలుపుపై పీకే కామెంట్స్
లోక్ సభ ఎన్నికల్లో ఈ రిజల్ట్స్్ వస్తాయా
Prashant Kishor : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి తీవ్ర హెచ్చరికలు చేశారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క కర్ణాటక నుంచే 20 సీట్లు కీలకంగా మారనున్నాయి.
ఈ తరుణంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి ఇవ్వక పోయినా సరే కానీ తన టార్గెట్ 20 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడం అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.
ఈ గెలుపును బలుపుగా తీసుకుంటే పప్పులో కాలు వేసినట్లేనని పేర్కొన్నారు. రాబోయే రోజులు గడ్డు కాలమని హెచ్చరించారు. ఇదే సమయంలో అద్భుత విజయాన్ని సాధించినందుకు కాంగ్రెస్ పార్టీని అభినందించారు ప్రశాంత్ కిషోర్. ఇదిలా ఉండగా బీహార్ లో జేడీయూ ,సంకీర్ణ సర్కార్ కు వ్యతిరేకంగా పీకే జన్ సురాజ్ పేరుతో పాదయాత్ర చేపట్టారు.
ఇందులో భాగంగా ఆయన సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు ప్రశాంత్ కిషోర్. ఎందుకనో వర్కవుట్ కాలేదు. చివరకు తన టీంలో పని చేసిన సునీల్ కనుగోలు ఒప్పందం చేసుకున్నాడు.
Also Read : DK Shiva Kumar