Prashant Kishor : గులాబీ గెలుపుపై పీకే ఫోకస్
సీఎం కేసీఆర్ తో మరోసారి భేటీ
Prashant Kishor : తెలంగాణ – రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సంబురం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలన్నీ శక్తి వంచన లేకుండా గెలిచేందుకు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ కొనసాగుతోంది. నిన్నటి దాకా నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగిన ప్రచారం రోజులు దగ్గర పడే కొద్దీ మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
Prashant Kishor Focus on BRS Winning
ఇందులో భాగంగా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే తొమ్మిదిన్నర ఏళ్లవుతోంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను రక్షిస్తాయని భావిస్తోంది. ఇప్పటికే కోడి కత్తి లాంటివి చోటు చేసుకున్నాయి. అచ్చంపేటలో గువ్వల బాల రాజు , దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి , కేటీఆర్ ప్రచార వాహనంలోంచి కింద పడడం, ప్రచార సభలో ఉండగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొమ్మసిల్లి పడి పోవడం అన్నీ వర్కవుట్ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రజలలో ఉన్న బలహీనతలను, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని రాజకీయ వ్యూహాలకు తెర లేపే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఎలాగైనా సరే బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పోటీ అంత ఈజీగా లేదని మరింత కష్ట పడాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ కు సూచించినట్లు టాక్.
Also Read : Eatala Rajender : లక్ష కోట్ల ప్రాజెక్టు గంగ పాలైంది