Prashant Kishor : నితీష్ బీజేపీతో చేతులు కలిపే ఛాన్స్
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్
Prashant Kishor : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు భారతీయ ఎన్నికల వ్యూహకర్త , ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్. గత కొంత కాలం నుంచీ నితీశ్ కుమార్(Prashant Kishor), పీకేలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు.
తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నితీశ్ కుమార్(Nitish Kumar) మళ్లీ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపే ఛాన్స్ ఉందంటూ బాంబు పేల్చారు. దీనిపై జనతాదళ్(యు) పార్టీ చీఫ్ లాలన్ సింగ్ తో పాటు ప్రముఖ నాయకులు పీకే పై నిప్పులు చెరుగుతున్నారు.
ఆయన పదే పదే తమను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇదే సమయంలో తాను పాదయాత్ర చేపడుతున్నది తన కోసం, రాష్ట్ర ప్రజల కోసం కాదని కేవలం బీజేపీకి మేలు చేకూర్చేందుకేనంటూ ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా 2020లో పార్టీ నుండి తొలగించబడే కంటే ముందు ప్రశాంత్ కిషోర్ సీఎం నితీశ్ కుమార్ తో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తూ వచ్చారు. తీరా గుడ్ బై చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ , తమిళనాడు రాష్ట్రాలలో పని చేశారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).
ఇదే సమయంలో 17 ఏళ్ల పాటు అనుబంధం కలిగిన బీజేపీతో సంబంధం తెగతెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిపి మహా ఘట్ బంధన్ పేరుతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేశారు. గేమ్ ప్లాన్ లో భాగంగా పీకే ఇలా చేస్తున్నారంటూ జేడీయూ ఆరోపించింది.
Also Read : మోదీజీ బడుల సంగతి చూడండి – కేజ్రీవాల్