Prashant Kishor : సంపద సృష్టించే బాధ్యత ప్రభుత్వాలదే
ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) ఫౌండర్ , భారతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. సంపదపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. సంపద అనేది అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు పీకే.
Prashant Kishor Comment
సంపద సృష్టించక పోతే డబ్బు ఎక్కడి నుంచి తీసుకు వస్తారని ప్రశ్నించారు. వచ్చిన వాటిని ఎలా పంచుతారంటూ నిలదీశారు. సంపద సృష్టించే వాతావరణాన్ని, సదుపాయాలను, వనరులను గుర్తించాలని అప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్.
ఈ సంపదను పోగు చేయడమో లేక దానిని ప్రత్యేకంగా సృష్టించే పని లేదా బాధ్యత ఆయా ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. ఆయన చేసిన తాజా ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఐప్యాక్ ఫౌండర్ ప్రస్తుతం తన స్వంత రాష్ట్రమైన బీహార్ లో ఊరూరా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. ఓటు విలువ ఏమిటో చెబుతున్నారు. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ మరోసారి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడం విశేషం.
Also Read : Rahul Gandhi : విజయనగరం రైలు ఘటన బాధాకరం