Prashant Kishor : భారతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం గాంధీ ఫ్యామిలీతో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ, కీలక నాయకురాలు ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు.
రాజకీయ వర్గాలలో పీకే సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
గతంలో కూడా పీకే గాంధీ ఫ్యామిలీతో కలిశారు. ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్, మణిపూర్ , పంజాబ్ , గోవాలలో ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో తిరిగి భారతీయ జనతా పార్టీ మరోసారి పవర్ లోకి వచ్చింది. ఇక అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో తన పవర్ ను కోల్పోయింది.
ఇక్కడ 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు తెచ్చుకుని పవర్ లోకి వచ్చింది. 18 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక త్వరలో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటకలో కూడా ఫోకస్ పెట్టనుంది. 2024లో దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని తట్టుకుని కాంగ్రెస్ పవర్ లోకి రావాలంటే కష్ట పడాల్సి ఉంటుంది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతోంది. గాడి తప్పిన పార్టీకి
జవసత్వాలు కావాలంటే పీకే లాంటి వ్యక్తి అవసరమని పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో ఇవాళ ప్రశాంత్ కిషోర్ గాంధీ ఫ్యామిలీతో కావడం చర్చకు దారితీసింది.
Also Read : దమ్ముంటే గుజరాత్ ఫైల్స్ తీయి