Prashant Kishor :భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్న పంజాబ్ ను పోగొట్టుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆజాద్ ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు స్వరం వినిపించారు. టీ కప్పులో తుపాను లాగా మారింది.
ఆజాద్ సోనియా గాంధీతో భేటీ కావడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇదిలా ఉండగా పంజాబ్ లో 18 సీట్లకే పరిమితమైంది. యూపీలో 2 సీట్లు దక్కించు కోగా మణిపూర్ , ఉత్తరాఖండ్ , గోవాలో ఆశించిన ఫలితాలు రాలేదు.
ప్రధానంగా శాసనసభ ఎన్నికల ఫలితాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రలలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే బాధ్యతను పీకే తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే గత ఏడాది కూడా ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. చర్చలు జరిపినా అవి ఫలవంతం కాలేదు.
విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురి మధ్య సఖ్యత కుదిరినట్లు సమాచారం. పార్టీతో టచ్ లో లేకుండా కేవలం ప్రొఫెషనల్ గా పని చేసేందుకు ఓకే చేసినట్లు టాక్. కాగా పీకే సన్నిహితులు దీనిని కొట్టి పారేస్తున్నారు.
అయితే ప్రశాంత్ కిషోర్ లోపాయికారిగా భారతీయ జనతా పార్టీకి పని చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Also Read : కశ్మీర్ ఫైల్స్ కు మోదీ ప్రచారం