Prashant Kishor : పీకేకు కాంగ్రెస్ బంప‌ర్ ఆఫ‌ర్

క‌న్స‌ల్టెంట్ గా వ‌ద్దు పార్టీనే ముద్దు

Prashant Kishor : భార‌త దేశంలో ఆక్టోప‌స్ లా అల్లుకు పోయిన భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ కోలుకోలేని రీతిలో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది.

గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక పోయింది. పంజాబ్ లో ఉన్న అధికారాన్ని అంత‌ర్గ‌త కార‌ణాల వ‌ల్ల కోల్పోయింది. 117 సీట్ల‌కు గాను 92 సీట్ల‌తో ఆప్ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది.

గోవా, మ‌ణిపూర్ , ఉత్త‌రాఖండ్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో కాంగ్రెస్ త‌న ఉనికిని కోల్పోయే ప్ర‌మాదం తెచ్చుకుంది. ఇక యూపీలో అయితే ప్రియాంక అన్నీ తానై ప్ర‌చారం చేసినా కేవ‌లం 2 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోవ‌డం ఆ పార్టీని విస్తు పోయేలా చేసింది.

ఇదే స‌మ‌యంలో ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ సోనియా గాంధీ ఫ్యామిలీ త‌ప్పు కోవాల‌ని కోరుతూ గులాం న‌బీ ఆజాద్ నేతృత్వంలోని జీ23 టీం బ‌హిరంగంగానే డిమాండ్ చేసింది.

ఆ త‌ర్వాత స‌ద్దు మ‌ణిగింది. ఈ త‌రుణంలో త్వ‌ర‌లో గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , క‌ర్ణాట‌క‌ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆప్ దూసుకు పోతోంది.

ఆ పార్టీ కాంగ్రెస్ ను దెబ్బ కొడుతూ వ‌స్తోంది. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి. ఏం చేస్తే పార్టీ మ‌ళ్లీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌నే దానిపై సుదీర్ఘంగా శ‌నివారం ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) భేటీ అయ్యారు.

ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ధ్రువీక‌రించారు. అయితే పీకేను క‌న్స‌ల్టెంట్ గా కాకుండా పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా పీకే స‌మావేశం కావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ మొద‌లైంది.

Also Read : భ‌గ‌వంత్ మాన్ పై త‌జింద‌ర్ పాల్ ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!