Prashant Kishor : బీహార్ భగ్గుమంటుంటే సీఎం ఎక్కడ – పీకే
నితీష్ కుమార్ వర్సెస్ బీజేపీ బిగ్ ఫైట్
Prashant Kishor : బీహార్ లో చోటు చేసుకుంటున్న ఘటనలపై తీవ్రంగా స్పందించారు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). ఓ వైపు బీహార్ భగ్గుమంటుంటే సీఎం నితీష్ కుమార్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
సీఎం, భారతీయ జనతా పార్టీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చివరకు యువకుల పాలిట శాపంగా మారిందన్నారు పీకే. వర్గ పోరు వల్ల మరింత అల్లర్లు, వరుస దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ఇది రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని సూచించారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా బీహార్ లో మొదట నిరసన మొదలైంది. అది ఆందోళనగా మారింది. ఆ తర్వాత దేశానికి పాకింది.
ఈ తరుణంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ నిరసన కాల్పులకు దారి తీసింది. ఒకరు చనిపోయారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
ఇంత జరుగుతున్నా ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్. గతంలో 2020లో పీకే జేడీయూలో చేరారు. ఆ తర్వాత అనూహ్యంగా బయటకు వచ్చారు.
బీజేపీ నాయకుల ఇళ్లను నిరసనకారులు దాడులకు తెగబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఇది అగ్నిఫథ్ స్కీం కంటే జేడీయూ వర్సెస్ బీజేపీ మధ్య ఆధిపత్య పోరుగా మారి పోయిందని పేర్కొన్నారు పీకే.
శాంతియుతంగా నిరసన తెలపాలని, కానీ విధ్వంసాలకు పాల్పడ వద్దని సూచించారు. బీజేపీ చీఫ్, మంత్రి ఇంటిపై దాడి చేస్తున్నా సీఎం నితీష్ కుమార్ సర్కార్ ఎందుకు నిలువరించ లేక పోయిందని ప్రశ్నించారు పీకే(Prashant Kishor).
ఇదే సమయంలో బీజేపీ చీఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read : అంతా అయి పోయాక ఆలోచిస్తే ఎలా