Prashant Kishor : కాంగ్రెస్ లోకి వెళితే మునగడం ఖాయం – పీకే
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
Prashant Kishor : రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఒక రకంగా ఎద్దేవా చేశారు.
ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు (బాస్ లు ) దిగి పోవడమే కాదు అందరినీ తమతో తీసుకు వెళతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక వేళ నేను కూడా ఆ పార్టీలోకి వెళితే మునిగి పోవడం తప్ప మరొకటి ఉండదన్నారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). కాంగ్రెస్ పార్టీ తాను దిగి పోవడమే కాక అందరినీ తనతో పాటు తీసుకు వెళుతోందంటూ పేర్కొన్నారు.
వారం రోజుల కిందట కాంగ్రెస్ తో ఆయన మంతనాలు జరిపారు. తాను ఎప్పటికీ ఆ పార్టీతో వెళ్లబోనంటూ స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్.
ఈ ఎన్నికల వ్యూహకర్త తన సొంత రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు బీహార్ గ్రామాల పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
2015లో బీహార్ , 2017లో పంజాబ్, 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు, బెంగాల్ లో గెలిచాం. 11 ఏళ్లలో తాను పనిచేసిన వాటిలో ఒకే ఒక్క ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని అన్నారు.
2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అందుకే కాంగ్రెస్ తో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). కాంగ్రెస్ ఎప్పటికీ కలిసిరాని పార్టీ అని అన్నారు. ఇప్పుడున్న బాస్ లు మామూలోళ్లు కాదన్నారు.
వాళ్లు వెళ్లడమే కాదు తమతో కూడా తీసుకు వెళతారని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కు నివాళులు అర్పించేందుకు వైశాలిలో జరిగిన సభలో పీకే మాట్లాడారు.
Also Read : సేవా సంస్థలకు హెచ్‌సీఎల్ ఆసరా