Prashant Kishor : దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క వ్యక్తి మీద ఫోకస్ పెట్టింది. అతడు ఎవరో కాదు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరొందిన ఐపాక్ సంస్థ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).
ఇప్పటి వరకు సుదర్ఘమైన కాంగ్రెస్ పార్టీ తో ఆయన నాలుగు సార్లు సమావేశం అయ్యారు. బ్లూ ప్రింట్ కూడా సబ్మిట్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్ మ్యాప్ సిద్దం చేశారు.
ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెడితే కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్న పీకే విచిత్రంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ను ఏలుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతో పోటీ నెలకొంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్. నువ్వెంత అంటే నువ్వెంత అని మాటలు పేలుస్తూ వస్తున్నారు. ఇద్దరు శత్రువుల మధ్య ప్రశాంత్ కిషోర్ ఎలా నెట్టుకు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా తాను ప్రజెంట్ చేసిన బ్లూ ప్రింట్ లో 370 స్థానాలలో పోటీ చేయాలని మిగతా 274 స్థానాలను ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు పీకే.
దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం ఉంటుందని , కాంగ్రెస్ తో దోస్తీ కొనసాగుతుందని మరోసారి కుండ బద్దలు కొట్టారు ప్రశాంత్ కిశోర్.
Also Read : పీకేతో టీఆర్ఎస్ కంటిన్యూ జర్నీ