APSRTC PRC : ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
APSRTC PRC : మాట ఇస్తే మడమ తిప్పని నైజం ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిది. ఆయన చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు పే స్కేల్(APSRTC PRC) అమలు చేసింది.
సిఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తిరుపతిని సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పిన కొద్ది గంటల్లోనే పే స్కేల్ అమలు కావడం విశేషం.
సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ(APSRTC PRC) సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ప్రతి నెలా పొందుతారు.
పేస్కేల్ తో పాటు అలవెన్సులు , ఇతర అన్ని అంశాలను కూడా జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం.
ఇదిలా ఉండగా అమలు చేస్తున్న పే స్కేల్ ను ప్రభుత్వంలో విలీనమైన 2020 జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది సర్కార్.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి గానే 32 గ్రేడ్లు, 83 స్టేజ్ లలో వారికి మాస్టర్స్ స్కేల్స్ వర్తింప చేయాలని నిర్ణయించింది. 23 శాతం ఫిట్ మెంట్ , డీఏ, హెచ్ ఆర్ ఏ, సీసీఏ కూడా ఇందులో ఉంది.
2018 జూలై 2020 జనవరి మధ్య ఆర్టీసీలో చేరిన ఉద్యోగులకు పే స్కేల్ నిర్దారించేందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అంతే కాకుండా పెన్షన్ , గ్రాట్యూటీ, ఇతర పదవీ విరమణ బెనిఫిట్స్ ను కూడా ఉద్యోగులకు ఇవ్వనుంది ప్రభుత్వం.
Also Read : సీఎం ఆదేశం కళ్యాణమస్తు పునః ప్రారంభం