Covid Cases Rise : ఇండిపెండెన్స్ రోజు జాగ్ర‌త్త‌లు పాటించాలి

క‌రోనా సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌

Covid Cases Rise : నిన్న మొన్న‌టి దాకా త‌గ్గుతూ వ‌చ్చిన క‌రోనా కేసులు(Covid Cases Rise) ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. రోజూ వారీగా ఈ కేసుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది.

ఇదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరుతో ఇంటింటిపై జాతీయ జెండాను ఎగుర వేయాల‌ని పిలుపునిచ్చింది. ఆగ‌స్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తున గుమి కూడ‌ద‌ని సూచించింది కేంద్ర ప్ర‌భుత్వం.

దీని వ‌ల్ల క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. కాగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని ప్ర‌తి జిల్లాలో ఒక ప్ర‌ముఖ ప్ర‌దేశంలో స్వ‌చ్ఛ భార‌త్ ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని ఆదేశించింది కేంద్రం.

దానిని స్వ‌చ్ఛ‌గా ఉండేందుకు నెల రోజుల పాటు చేప‌ట్టాల‌ని, ప్ర‌చారం చేయాల‌ని సూచించింది. ఇదే విష‌యాన్ని ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కూడా స్ప‌ష్టం చేసింది.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇందులో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చింది. పెరుగుతున్న క‌రోనా కేసులు పెరుగుతున్న కార‌ణంగా భారీ స‌మావేశాలు నిర్వ‌హించ కూడ‌దంటూ హెచ్చ‌రించింది.

వాటికి దూరంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌తి రోజూ స‌గ‌టున 15,000కి పైగా క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాల‌ని కోరింది.

శుక్ర‌వారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం భార‌త దేశంలో 16,561 కొత్త‌గా కేసులు న‌మోద‌య్యాయి. ఇక క‌రోనా కేసుల సంఖ్య 4,42,23,557 కేసులు న‌మోద‌య్యాయి.

Also Read : ట్విట్ట‌ర్ కు ధీటుగా ఎలోన్ మ‌స్క్ ఫ్లాట్ ఫామ్

Leave A Reply

Your Email Id will not be published!