Adani Group : ఒడిశాలో అదానీ రూ. 57,000 కోట్ల‌ పెట్టుబ‌డి

ప్ర‌క‌టించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి అదానీ

Adani Group : భార‌తీయ ప్ర‌ముఖ వ్యాపార కంపెనీ అదానీ గ్రూప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఒడిశా రాష్ట్రంలో రూ. 57,000 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంద‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశంలోని బాక్సైట్, ఇనుప ఖ‌నిజ నిల్వ‌ల‌లో స‌గానికి పైగా ఒడిశా రాష్ట్రం వాటా క‌లిగి ఉంది. ఒడిశా లోని రెండు ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూపు మొత్తంగా రూ. 57, 575 కోట్లు ఇన్వెస్ట్ చేయ‌నుంది.

ఏడాదికి 4 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినా రిఫైన‌రీ , 30 మిలియ‌న్ ట‌న్నుల ఇనుప ఖ‌నిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది.

ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించిన సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని అటు అదానీ గ్రూపు(Adani Group) ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం వేర్వేరు ప్ర‌క‌ట‌నల్లో అధికారికంగా ధ్రువీక‌రించాయి.

అల్యూమినా రిఫైన‌రీ, బాక్సైట్ నిల్వ‌లు గ‌నుల స‌మీపంలో ఏర్పాటు చేస్తారు. ఇది స్మెల్ట‌ర్ గ్రేడ్ అల్యూమినాను ఉత్ప‌త్తి చేస్తుంది. ఒక ర‌కంగా ఇతర దేశాల‌కు పంపించేందుకు వీలు క‌లుగుతుంది.

ఐర‌న్ ఓర్ బెనిఫికేష‌న్ ప్లాంట్ కియోంఝ‌ర్ జిల్లా లోని డియోజార్ లో , పెల్లెట్ ప్లాంట్ ప‌క్క‌నే ఉన్న భ‌ద్ర‌క్ జిల్లాలోని ధామ్రాలో ఏర్పాటు చేయ‌నున్నారు. స్ల‌ర్రీ పైప్ లైన్ దియోజార్ , ధ‌మ్రా మ‌ధ్య రోడ్ల యుటిలిటీ కారిడార్ లో న‌డుస్తుంద‌ని తెలిపారు.

పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించిన అత్యంత వ్యూహాత్మ‌క రాష్ట్రాల‌లో ఒడిశా ఒక‌టి. సీఎం న‌వీన్ ప‌ట్నాయక్ అందించిన స‌హకారం మ‌రిచి పోలేమ‌న్నారు అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ.

Also Read : క్ష‌మాభిక్ష‌ను పొందిన శామ్ సంగ్ బాస్

Leave A Reply

Your Email Id will not be published!