Samantha Yashoda : య‌శోద మూవీలో గ‌ర్భిణీగా స‌మంత‌

విడుద‌లైన టీజ‌ర్ కు భారీ ఆద‌ర‌ణ

Samantha Yashoda :  ఊ అంటావా పుష్ప మూవీతో ఒకే ఒక్క పాట‌తో దేశ వ్యాప్తంగా స్టార్ డ‌మ్ పొందిన ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు తాజాగా న‌టించిన య‌శోధ‌ మూవీ టీజ‌ర్ విడుద‌లైంది.

ఈ థ్రిల్ల‌ర్ చిత్రంలో మ‌నుగ‌డ కోసం పోరాడుతున్న గ‌ర్భిణీగా న‌టించింది స‌మంత‌. ఈ చిత్రం గ‌ర్భిణీ స్త్రీని కేంద్రంగా చేసుకుని తీశారు. మొద‌ట తెలుగులో చిత్రీక‌రించిన ఈ మూవీని త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోకి డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

స‌మంత(Samantha Yashoda) త‌న ట్విట్ట‌ర్ పేజీలో టీజ‌ర్ ను షేర్ చేసింది. బ‌లం, సంక‌ల్ప శ‌క్తి క‌లిగి ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. య‌శోద త‌ను గ‌ర్భ‌వ‌తి అని చెప్ప‌డంతో టీజ‌ర్ ఓపెన్ అవుతుంది.

ప్రెగ్నెన్సీ పీరియ‌డ్ లో త‌న‌ను తాను చాలా జాగ్ర‌త్త‌గా చూసు కోవాల‌ని డాక్ట‌ర్ ఆమెకు స‌ల‌హా ఇస్తారు. కాగా ఆమెను ఎవ‌రో వెంబ‌డిస్తున్న దృశ్యాలు క‌నిపిస్తాయి సినిమాలో. ఇది స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ కోసం ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఫైట్ లాగా క‌నిపిస్తోంది.

య‌శోధ‌ర చిత్రంలో పూర్తిగా స‌మంత పాత్ర‌ను హైలెట్ చేసిన‌ట్టుగా ఉంది. ఇప్ప‌టికే న‌ట‌న‌లో వంద మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. కాక పోతే గ‌త కొంత కాలంగా ఆమె దేశ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచారు.

అక్కినేని నాగ చైత‌న్య‌తో పెళ్లి చేసుకుని ఆ త‌ర్వాత విడి పోయారు. కానీ స‌మంత కెరీర్ లో ఎక్కువ అవ‌కాశాలు విడిపోయాక రావ‌డం విశేషం.

చాలా మంది హీరోయిన్ల‌కు బ్రేక‌ప్ చెప్పాక చాన్స్ లు రావు. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో స‌మంత క‌లిసి న‌టిస్తోంది.

Also Read : ఐశ్వర్య మీనన్ క్యూట్ అండ్ స్పైసీ హాట్ అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!