Pregnant Woman: పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను రెండు కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

పురిటినొప్పులతో బాధపడుతున్న భార్యను రెండు కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

Pregnant Woman : అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలో అడవి బిడ్డలకు కష్టాలు తప్పడం లేదు. అంతరిక్షానికి సులువుగా వెళ్లి వచ్చేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు… మారుమూల గిరిజన గ్రామాలకు మాత్రం రోడ్లు వేయలేకపోతున్నాయి. దీనితో కనీస మానవ అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం గిరి పుత్రులు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో వైద్యం కోసం డోలీ మోతలు తప్పనిసరిగా మారుతోంది. సరిగ్గా ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్ దిద్ద మండలం మున్యానాయక్ తండాలో జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను (Pregnant Woman) సుమారు రెండు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన ఘటన జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Pregnant Woman Carried on Shoulders

సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం శాంతినగర్‌తండా పంచాయతీ పరిధిలోని మున్యానాయక్‌ తండాకు చెందిన కౌసల్యబాయి (26) నిండు గర్భిణి. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ వెంటనే బయలుదేరినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు బురదమయంగా మారడంతో వారి తండాకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. భార్యకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో భర్త వాసుదేవ్‌ ఆమెను అంబులెన్స్‌ వద్దకు మోసుకెళ్లేందుకు నిర్ణయించుకొని బయలుదేరాడు. ఆమెను భుజాలపై రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాడు.

అయితే ఆమెకు పురిటినొప్పులు ఎక్కువై మార్గమధ్యలోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె వద్దకు నడుచుకుంటూ చేరుకున్న 108 సిబ్బంది ఆమెను చేతులపై తీసుకెళ్లి వాహనంలోకి ఎక్కించి, కర్‌సగుత్తిలోని ప్రభుత్వ ఆసత్రికి తరలించారు. తల్లి, బిడ్డను పరీక్షించిన వైద్యులు వారు క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాగా, అధికారులు, నేతలు ఇప్పటికైనా స్పందించి రోడ్డుసౌకర్యం కల్పించాలని తండా వాసులు కోరారు.

Also Read : Hyderabad Metro: దేశంలో మొట్టమొదటి మెట్రో ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!